శృంగారానికి ఆ రెండు వారాలే ఉత్తమమా ?

0
46

మన దేశ సంప్రదాయం మేరకు ఇక్కడు బహిరంగ శృంగారం నిషిద్ధం. భార్యాభర్తల మధ్య శృంగారం కేవలం పడక గదికే పరిమితం. అయితే, శృంగారాన్ని అత్యంత రహస్యంగా భావించే భారతీయులు శారీరకంగా ఏ వారాల్లో ఎక్కువగా కలుసుకుంటారన్న అంశంపై లవ్ హనీ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వే ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఎక్కువగా, శని, ఆదివారాల్లో మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నట్టు తేలింది. మిగిలిన రెండు రోజుల్లో ఏకంగా 45 శాతం మంది దంపతులు శృంగారంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు.

శుక్రవారం 23 శాతం, ఆదివారం 16 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.

అదేసమయంలో ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. అయితే కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది. పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయ డానికి కేవలం పదిశాతం మంది మాత్రమే సిద్ధ పడుతున్నారట. అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొంటున్నట్టు లవ్ హాని సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది, బుధవారం 7 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపు తున్నారట. పైగా శృంగార కోరికలనేవి వేసవి కాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయస్సుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది.