టీ20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 147 రన్స్.. అయ్యర్ విజృంభణ

0
77

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ జరుగుతోంది. ఇందులోభాగంగా ముంబై ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ యువ క్రికెటర్ కేవలం 55 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లతో 147 పరుగులు చేసి అబ్బురపరిచాడు.

తద్వారా గతంలో ఢిల్లీ ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 128 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉండేది. అలాగే ఓ మ్యాచ్‌లో సిక్సర్ల విషయంలో భారత్‌ తరఫున మురళీ విజయ్‌ (11) టాప్‌లో ఉండగా, ఈ రికార్డునూ అయ్యర్‌ 15 సిక్సర్లతో అధిగమించాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గత రికార్డులను చెరిపేశాడు.

ఇకపోతే, టెస్ట్ స్పెషలిస్టు ఆటగాడిగా ముద్రపడిన ఛటేశ్వర్ పుజారా కూడా అనూహ్యంగా టీ20 ఫార్మాట్‌లోనూ సత్తా చాటాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఓపెనర్‌‌గా బరిలోకి దిగిన పుజారా 61 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 100 (నాటౌట్‌) తొలిసారి శతకంతో అబ్బురపరిచాడు. అయితే అతడి జట్టు మాత్రం 5 వికెట్ల తేడాతో ఓడింది. ప్రపంచ కప్ షెడ్యూల్ సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరూ అద్భుతంగా రాణించడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.