అరటిపండు ఆడవాళ్లకు మంచిదా? కాదా ?

0
59

ప్రతి రోజూ ఒకటి చొప్పున అరటి పండును మహిళలు ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ముఖ్యంగా, హృద్రోగ సమస్యలతో పాటు గుండెపోటు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఈ విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల స్ట్రోక్‌ సమస్యలను అధికమించవచ్చని తేలింది.

ఈ అధ్యయనం కోసం మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించిన సుమారుగా 90 వేల మందిని పరిశీలించారు. ఈ మహిళలందరూ 50-79 వయస్సు వాళ్లు. 11 సంవత్సరాల పాటు ఈ స్టడీని కొనసాగించారు. ఈ కాలపరిమితిలో పొటాషియం ఉన్న ఫుడ్స్‌ను వీళ్లు ఎంత తీసుకుంటున్నారు, స్టడీ సమయంలో వారికేమైనా స్ట్రోక్‌ వచ్చిందా? చనిపోయారా? వంటి అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

వీరి అధ్యయనంలో పోటాషియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల స్ట్రోక్‌ రిస్కు నాలుగోవంతు తగ్గుతుందంటున్నారు. ఈ స్టడీలో పాల్గొన్నవారు రోజుకు 2.622 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకుంటున్నట్టు వెల్లడైంది. ఈ పరిశోధన కోసం ప్రతి మహిళ ప్రతి రోజూ ఓ అరటిపండు ఆరగించేలా వారు కండిషన్ విధించారు.