ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు

0
138

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారన్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై తమ సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ పలువురు స్టార్ హీరోలు సైతం ఆయనకు నివాళులు అర్పించారు. కోడి రామకృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఐతే.. నిన్న మరణించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ఈరోజు ముగిశాయి. కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తె దీపిక తండ్రి చితికి నిప్పంటించారు.