భారత్‌లో కేజీ టమోటా రూ.10… పాకిస్థాన్‌లో కేజీ టమోటా ధర రూ.180

0
42

పాకిస్థాన్‌లో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కేజీ టమోటా రూ. 10 ఉండగా… పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కేజీ రూ.180కి పెరిగింది. పెరిగిన టమోటా ధరలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఇక్కట్ Jammu and Kashmir’s Pulwamaలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ దేశానికి టమోటాల ఎగుమతిని ఆపివేస్తూ మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లా రైతులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 5వేల మంది రైతులు ఈ జిల్లాలో టమోటాను పండిస్తున్నారు. ఇక్కడి నుంచి పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి అవుతోంది. కానీ పుల్వామా దాడి నేపథ్యంలో టమోటాల ఎగుమతిని ఆపేయాలని మండి అధికారులు తెలిపారు.

తాము టమోటాను సాగు చేస్తున్నాం. పాకిస్థాన్‌కు కూడా ఎగుమతి చేస్తున్నాం. మన ఆహారాన్ని తింటూ మన జవాన్లనే వారు చంపుతున్నారు. పాకిస్థాన్ నాశనం కావాలని తాము కోరుకుంటున్నామని రవీంద్ర పటిదార్ రైతు చెప్పారు. ఇతర దేశాలు కూడా పాకిస్థాన్‌కు టమోటాను ఎగుమతి చేయరాదని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

సైన్యమే లేకపోతే మనం ఎలా బతుకుతామని… ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి కూడా పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతులను ఆపేసినట్లు మండీ అధికారులు తెలిపారు. దీంతో టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి.