ఆ మ్యాచ్ ఆడకుండా.. రెండు పాయింట్లు ఇస్తారా..? సచిన్ ప్రశ్న

0
40

ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. భారత జట్టు వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకుండానే అప్పనంగా రెండు పాయింట్లు అప్పగించినట్లు అవుతుందని… అలాంటి వ్యవహారాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశాడు. ఒకవేళ భారత్ ఆ మ్యాచ్‌లో ఆడకపోతే చిరకాల ప్రత్యర్థిలాంటి పాకిస్థాన్‌కు మేలు చేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇప్పటివరకు పాకిస్థాన్‌ను ప్రతి వరల్డ్ కప్‌లోనూ మనవాళ్లు మట్టికరిపించారని, ఈ ప్రపంచ కప్‌లోనూ అదే ఊపుతో ఓడించాలని పిలుపునిచ్చాడు. అలాకాకుండా పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దనుకునే నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా ఆ నిర్ణయాన్ని భరించలేనని అన్నాడు. అయితే, దేశ ప్రయోజనాలే తనకు ప్రథమ ప్రాధాన్యం అని, ఇందులో మరో మాటకు తావులేదని సచిన్ స్పష్టం చేశాడు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉన్నా దానికి మనస్ఫూర్తిగా మద్ధతిస్తానని చెప్పాడు.

Sachin Tendulkar

ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న 2019 వరల్డ్ కప్ లో షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాక్ జట్లు తలడాల్సి ఉంది. పుల్వామా ఘటన నేపథ్యంలో దాయాదుల సమరంపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.