సూపర్ డీలక్స్ నుంచి ట్రైలర్ విడుదలైంది. తమిళంలో టి.కుమారరాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్ కూడా అదిరింది.