హనుమాన్ జంక్షన్ సోదరికి హైబీపీ.. దాతలు ముందుకు రండి..

0
40

‘హనుమాన్ జంక్షన్’లో హీరోలు జగపతిబాబు, అర్జున్‌లకు సోదరిగా నటించిన విజయలక్ష్మి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఇటీవల విజయలక్ష్మి తల్లి తీవ్ర అనారోగ్యం బారినపడి ఆసుపత్రిపాలైంది. ఉన్న డబ్బంతా తల్లి కోసమే ఖర్చు చేసింది విజయలక్ష్మి.

అంతలోనే తాను సైతం అనారోగ్యంపాలైంది. ఆమె హైబీపీతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఒక దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దాంతో విజయలక్ష్మి కుటుంబం ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి సోదరి ఉషాదేవి ఓ ప్రకటన చేసింది.

తన తల్లి, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయిందని, ఎవరైనా ముందుకొచ్చి సాయంచేస్తేనే తల్లిని, సోదరిని కాపాడుకోగలనని దీనంగా వేడుకుంది.. ఉషాదేవి.

తమిళంలో సూర్యా సరసన ఫ్రెండ్స్ అనే చిత్రంలో నటించిన విజయలక్ష్మి కొద్దికాలంగా సినిమా అవకాశాలు తగ్గడంతో కన్నడ సీరియల్స్‌లో నటిస్తోంది.