ఆస్ట్రేలియా టీ-20.. కడవరకు పోరాడినా నో యూజ్.. ఓటమి తప్పలేదు..

0
55

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ-20లో భారత్ ఖంగుతింది. స్వల్ప విజయ లక్ష్యాన్ని చేధించేందుకు కోహ్లీ సేన మల్లగుల్లాలు పడింది. కడవరకు పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో తొలి టీ-20లో టీమిండియా పరాజయం పాలైంది. మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయ భేరి మోగించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి విజయం సాధించింది.

చివరి ఓవర్‌లో కంగారూల గెలుపునకు 14 పరుగులు అవసరం కాగా కమ్మిన్స్, రిచర్డ్సన్ జోడీ చెరో ఫోర్ కొట్టి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకుంది. వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో మొదట భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

నిర్ణీత 20 ఓవర్లలో రాహుల్ ఆటతీరుతో ఏడు వికెట్లకు 126 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధంచే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ డార్సీ షార్ట్ 37, గ్లెన్ మ్యాక్స్ వెల్ 56 పరుగులతో విజయానికి బాటలు వేశారు.

టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బుమ్రా వరుస బంతుల్లో హ్యాండ్స్ కోంబ్, కౌల్టర్ నైల్‌లను వెనక్కి పంపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో భారత్‌కు ఆదిలోనే కంగారూల నుంచి పరాభవం తప్పలేదు.