”తలైవి”గా వస్తున్న జయలలిత

0
52

తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళనాట ”అమ్మ” ప్రజల మదిలో నిలిచిపోయిన.. ఆమె జీవిత చరిత్రను బయోపిక్‌గా తెరకెక్కనుంది. సినీతారగా, రాజకీయ నాయకురాలిగా అమ్మ రాణించిన అంశాలు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

అలాగే దివంగత జయలలిత జీవితాధారంగా ప్రస్తుతం రెండు బయోపిక్‌లను తెరకెక్కిస్తున్నారు. ఓవైపు ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ‘ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంటే.. మరోవైపు ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌కు సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమా కోసం పరిశోధనలు జరిపి మరీ ఆయన రంగంలోకి దిగారు. జయలలిత జయంతి సందర్భంగా ఆదివారం (ఫిబ్రవరి 24) చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించింది. విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ”తలైవి” అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది.