అందుకే మోదీని ఆలింగనం చేసుకున్నాను: రాహుల్ గాంధీ

0
50

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ప్రేమతోనే జయించాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. దాడుల వలన తన ఇద్దరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నానని చెప్పారు. ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయించగలదని రాహుల్ స్పష్టం చేశారు. పార్లమెంటులో తాను మోదీని కౌగిలించుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారని తెలుసని.. అసలు ఏం జరిగిందోనని ఆయనకు కూడా అర్థమై ఉండదన్నారు. ఈ సంఘటనతో మోదీ జీవితంలో ప్రేమ లేదని తనకు అనిపించిదన్నారు.