స్మార్ట్‌ఫోన్ బ్రైట్ నెస్.. ఆమె కళ్లకు 500 రంధ్రాలు.. నిజమా?

0
55

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. స్మార్ట్ ఫోన్ల వాడకం ద్వారా కంటికి పెను ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకు ఈ ఘటనే నిదర్శనమని ఉదహరిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ కూడా అనారోగ్యానికి కారణమవుతుందని తైవాన్‌లో ఓ అరుదైన కేసు ద్వారా గుర్తించారు. స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్‌తో కళ్లకు 500 రంధ్రాలు ఏర్పడ్డాయంటే.. నమ్మితీరాల్సిందే.

పాతికేళ్ల చెన్ అనే మహిళ కొంతకాలంగా తీవ్రమైన కంటినొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు కార్నియా టెస్ట్ చేసి షాక్ తిన్నారు. ఆమె రెండు కళ్లలో కార్నియా అత్యంత తీవ్రస్థాయిలో దెబ్బతిన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది.

రెండు కార్నియాల్లో దాదాపు 500 సూక్ష్మ రంధ్రాలు ఉన్నట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు వైద్యులు. ఇంకా రెటీనా కూడా దెబ్బతింది. అందుకు కారణం స్మార్ట్ ఫోన్ ను ఫుల్ బ్రైట్ నెస్ తో చూడడమేనని గుర్తించారు. సాధారణంగా ఫోన్ బ్రైట్ నెస్ 300 ల్యూమెన్స్ మాత్రమే ఉండాలి.

కానీ చెన్ ఉపయోగించిన ఫోన్ అంతకు రెట్టింపు స్థాయిలో బ్రైట్ నెస్ కలిగి ఉందట. అందుకే ఆమె కంటికి అన్ని రంధ్రాలు పడ్డాయని వైద్యులు గుర్తించారు.