ఏపీలో మొన్నటికి మొన్న జ్యోతి ఘటన మరవక ముందే.. పశ్చిమ గోదావరిలో ఓ యువతిపై దారుణం చోటుచేసుకుంది. ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఆపై యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా… యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి, కామవరపు కోచ మండలం, జీలకర్రగూడెంలోని బౌద్ధరామాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బౌద్ధరామాల సందర్శనకు వెళ్లిన ప్రేమ జంటపైనే ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు భీమడోలు మండలం అజ్జవారి గూడెం వారిగా పోలీసులు గుర్తించారు. బౌద్ధారామాలు అటవీప్రాంతంలో ఉండడం, జనసంచారం తక్కువగా ఉండడం వల్లే దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -