ప్రియురాలని, ఆమె కొడుకుని హత్య చేశాడు.. అయినా ప్రభుత్వం రూ.150 కోట్లు చెల్లించింది

0
38

అమెరికాలోని కాలిఫోర్నియాలో భార్యను, బిడ్డను హత్య చేసిన ఓ ముద్దాయికి ప్రభుత్వం ఉడతాభక్తిగా రూ.150 కోట్లు ఇచ్చింది. పైగా, ఈయన జైలుశిక్ష అనుభవించిన కాలానికి రోజుకు 140 డాలర్లు చొప్పున మొత్తం కాలానికి 1.95 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా ???

కాలిఫోర్నియాకు చెందిన క్రైగ్ కాలీ అనే 71 యేళ్ల వ్యక్తి తన ప్రియురాలు ఆమె కుమారుడిని హత్య చేసినట్టు పోలీసులు అభిపోయాగాలు మోపగా, కోర్టు వాటిని నమ్మి.. దోషిగా గుర్తించింది. దీంతో ఆయన నాలుగు దశాబ్దాల పాటు జైలుశిక్షను అనుభవించాడు. కానీ, క్రైగ్ మాత్రం తాను మాత్రం ఏ నేరం చేయలేదని బలంగా వాదించాడు. చివరకు న్యాయమే గెలించింది. ఈ జంట హత్యలపై విచారణ జరిపిన కోర్టు.. క్రైగ్ కాలీ ఈ హత్యలు చేయలేని తేల్చింది. దీంతో ఆయన 39 యేళ్ళ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు.

అయితే, పోలీసుల తప్పుడు అభియోగాల కారణంగా చేయని తప్పుకు ఏకంగా 39 యేళ్లపాటు జైలుశిక్ష అనుభవించినందుకుగాను, అంటే అతను జైల్లో గడిపిన ప్రతి రోజుకూ 140 డాలర్లు (రూ.9,500పైగా) లెక్కగట్టి 1.95మిలియన్ డాలర్లు (రూ.14కోట్లకు పైగా) ను కాలిఫోర్నియా ప్రభుత్వం చెల్లించింది. ఈ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కున్న క్రైగ్.. ప్రస్తుతం దానిలోనే ఉంటున్నాడు.

అయితే ఈ కథ ఇక్కడితో పూర్తికాలేదు. క్రైగ్ కోల్పోయిన జీవితాన్ని తిరిగివ్వలేమని భావించిన సిమీ వ్యాలీ సిటీ ప్రభుత్వం అతనికి మరింత ఆర్థిక సాయం చేయాలని భావించింది. అంతే.. అనుకున్నదే తడవుగా అతనికి 21 మిలియన్ డాలర్లు (సుమారు రూ.150కోట్లు) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ డబ్బు అతను కోల్పోయిన జీవితాన్ని తిరిగివ్వలేదని, ప్రభుత్వం అతని విషయంలో చేసిన పొరబాటుకు ఇది చిన్న పరిహారమనేని పేర్కొంది. ఈ డబ్బుతో ప్రపంచ పర్యటనకు శ్రీకారం చుట్టాడు క్రైగ్.