కవి హృదయం… సందీప్ కిలాడి

2
466
నాలో నిన్ను…
మాట కఠినం కావచ్చు
భావం అంతర్లీనంగా ఉంటుంది
పదాలు పరుషం కావచ్చు
పరిస్థితులకు అనుగుణంగా తీరు ఉంటుంది
నన్ను చాలా మంది ద్వేషించొచ్చు
కానీ అర్థమైతే నాలో నిన్ను చూసినట్టు ఉంటుంది.
బలం మీద కొట్టు..
కక్ష సాధించాలంటే శతృవు బలం మీద కొట్టాలి కానీ బలహీనత మీద కాదు.
బలాల మీద కొట్టేవాడు యోధుడు, బలహీనత మీద కొట్టేవాడు నపుంసకుడు.
గుండె భారం…
పదునైన నా కలం కదలను అంటుంది
మెదడులోని ఆలోచన చేతిని చేరనంటుంది
మనసేమో నన్ను వ్యక్తపరుచు అంటుంది
నా భావాలకు అక్షరాలు సరిపోక గుండె భారం అవుతుంది.
ఎండిపోని సముద్రంలా…
కొందరికి నావి కేవలం రాతలే కావొచ్చు,
ఇంకొందరికి ఇవి శాసనాలు అవ్వొచ్చు,
రాతలైనా శాసనాలైనా భావాలన్నీ తెలుపకపోవొచ్చు,
కానీ ఎండిపోని సముద్రంలా మారిన మనసు ఇది పట్టించుకోకపోవచ్చు.
తావే లేని ఈడ..ఆరాటమెల..
మాంసపు ముద్దకై ఆరాటమేల
అద్దె అందం వెనక ఆ పరుగులు ఏల
నిర్మలమైన మనసుకు తావే లేని ఈడ
అబద్ధాలే నమ్మబలికే వ్యక్తులతో స్నేహమేಲ ?
నా గుండెలోని నీటి చెమ్మ…
ఆకాశం ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది
అందుకున్న తర్వాతే శూన్యం ఏంటో తెలుస్తంది..
తన కళ్ళు నాకు ఎంతో అందంగా కనిపిస్తుంటే
తనని కోల్పోయిన నా గుండెలోని నీటి చెమ్మ మాత్రం నాకే తెలుస్తుంది..
రచన: సందీప్ కిలాడి

2 COMMENTS

Comments are closed.