‘కేజీఎఫ్’ అదిరిపోయింది: కేటీఆర్

0
30

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా సౌత్ ఇండియా లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఐతే ఈ సినిమా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో కూడా రిలీజ్ అయ్యి…ఇంటర్ నెట్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సినిమా ను చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్ పెట్టడం విశేషం. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, ‘కొంత ఆలస్యంగానైనా ‘కేజీఎఫ్’ చూశాను. వాట్ ఏ మూవీ. టెక్నికల్ గా అద్భుతంగా. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, సూపర్బ్ డైరెక్షన్, మ్యూజిక్ చాలా బాగుంది. ఇక రాక్ స్టార్ యష్ స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయింది’ అంటూ పాజిటివ్ గా ట్వీట్ చేశారు.