బన్నీ కోసం కథను సిద్ధం చేసిన త్రివిక్రమ్

0
55

హీరో అల్లు అర్జున్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథను సిద్ధం చేశాడు. బన్నీ నటించిన చివరి చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆ తర్వాత ఏ ఒక్క చిత్రానికి ఆయన కమిట్ కాలేదు. ఈ నేపథ్యంలో బన్నీ ఇపుడు తదుపరి సినిమా అంగీకరించాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చాయి. ఇది మూడో చిత్రం. ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బన్నీ సరికొత్త లుక్‌తో కనిపించనున్నాడు. గతంలో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా తీసిన త్రివిక్రమ్ ఈ సారి బన్నీ కోసం ఎలాంటి కథ తీసుకురానున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.