భారత్ ఓడినా.. రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

0
49

స్వదేశీ గడ్డపై పర్యాటక జట్టు ఆస్ట్రోలియాతో ఆదివారం విశాఖ వేదికగా తొలి ట్వంటీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినప్పటికీ… భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో తన వ్యక్తిగత స్కోరు 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అదేసమయంలో ఆస్ట్రేలియాపై టీ20ల్లో 500 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఆసీస్‌పై ఇప్పటి వరకు ఎవరూ 500 పరుగులు సాధించలేదు. ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమినీ పేరుపై ఉంది. ఆ జట్టుపై 15 మ్యాచ్‌లు ఆడిన డుమినీ 378 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఇదే అత్యధికం ఉండేది. ఇపుడు ఈ రికార్డును బద్ధలుకొట్టడమే కాకుండా, ఏకంగా 500 పరుగులు చేసి రికార్డు అందుకున్నాడు. కోహ్లీ 14 మ్యాచ్‌లలోనే 500 పరుగులు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 12 పరుగుల వద్దకు చేరుకోగానే కోహ్లీ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చి చేరింది.