“ఎన్టీఆర్” బయోపిక్ పై విజయసాయిరెడ్డి విమర్శలు

0
54

బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమా ఘోరమైన ప్లాప్ అయిన తర్వాత..టీం తమ ఆశలన్నీ “ఎన్టీఆర్ మహానాయకుడు” మీదనే పెట్టుకున్నారు. ఐతే మహానాయకుడు కూడా ఆశించిన స్థాయి లో విజయం కాలేదు, సినిమా కి ఆశించిన స్థాయి లో డబ్బులు రాలేదు. కథా-కథనాలతో కూడా జనాలని ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ని.. హీరో లా ప్రెసెంట్ చేసిన తీరు పై అటు జనాలు, ఇటు రాజకీయనాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఇక దొరికిందే సందు అన్నట్టు…వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా తన దైన శైలి లో సెటైర్లు వేశారు.

“బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికే విలనే, హీరో కాలేడు.” అంటూ సెటైర్లు వేశారు.