‘అంగం’ గట్టిపడకపోవడం లోపమా ?

0
157

ప్రతి పురుషుడూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సమస్య ‘అంగం’ గట్టిపడకపోవడం (ఎరెక్టయిల్ డిస్‌ఫంక్షన్). ఒకవేళ గట్టిపడినా ఎక్కువ సేపు ఆ స్థితిలో ఉండదు. ఈ సమస్య నేటి యువత ఎక్కువగా ఎదుర్కొంటోంది. దీనికి కారణం వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి. భాగస్వామిని సంతృప్తి పరచగలనా లేదా అనే ఆలోచన. ఇత్యాది కారణాలే. అయితే స్వయంతృప్తి పొందే సమయంలో గట్టిపడుతూ భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయానికి గట్టిపడకపోవడం వంటి సందర్భాలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యనే ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌ అంటారు. అయితే, ఈ లోపాన్ని పూర్తిగా ఓ సమస్యగా చెప్పడానికి వీల్లేదు. పూర్తిగా స్తంభన కోల్పోయినప్పుడే సమస్యగా భావించాలి. అంగ స్తంభన కోల్పోవడానికి అసలు కారణాన్ని ఎంత త్వరగా కనుక్కోగలిగితే అంత మేలు. ఎందుకంటే… కొన్ని హృద్రోగవ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన వ్యాధుల్లో కూడా అంగ స్తంభన సమస్య తలెత్తుతుంది. సో.. అంగ స్తంభన సమస్య ఉండేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి.