మహాశివరాత్రి నాడు ఆ మూడు మరిచిపోకండి..

0
55

కైలాసనాధుడైన పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణలోకి వచ్చింది. భోలాశంకరుడు,ఈశ్వరుడు,లింగోద్బోవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ మహాశివుడే.. మాఘమాసం బహుళ చతుర్థశి రోజున అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్పుతున్నాయి. ఆ రోజున జాగారణ నిర్వహించాల్సి ఉంటుంది.

శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సాంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక్కరోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం రోజు ఉదయం స్నానాదులు పూర్తిచేసుకొని ,శివదర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపావాసం ఉండాలి. ఆ రోజు రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ.. జాగారణ చేయాల్సి ఉంటుంది.

అయితే పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, అభిషేకం లాంటి వాటితో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్పుతున్నారు. ఇలా చేస్తే అనుకున్నా కార్యాలు సిద్దిస్తాయి. సకల సంపదలు చేకురుతాయని విశ్వాసం.