కవి హృదయం… రంజిత్ కుమార్ బబ్బూరి

0
168

ఉదయించిన సూర్యుడి భగభగలు ఒంటికి తగులుతుంటే
కమ్మేసిన చీకటికి ఉషోదయమొచ్చిందని మేల్కొన్నా
అనంతంగా నిండిన విషాద హృదయపుదారుల్ని
కొత్తగా పలకరించి నీ గమ్యాన్ని చేరుస్తుందనుకున్నా
చీకటిలో చితికిపోయిన బతుకుకు వెలుగొచ్చిందని
రెక్కలొచ్చిన పక్షినై నీ కోసం ఎగిరొద్దామనుకున్నా
గ్రహించనేలేదాయే అనంత దూరాల్లో నువ్వున్నావని
నిషిరాత్తిరి ఆవహించిన నా మదిలో ఇక వెలుగుండదని.

యదలో నిశ్శబ్దం సాక్షిగా కాలాగ్నిలో కరిగిపోతుంది జీవితం
గతవైభవాలను మోసుకెళ్లిన నీవైపు అడుగేయలేక
శూన్యమంతా అలుముకుంది నా అంతరం
నా శరీరాన్ని చితికి అర్పించుకోలేక
మూగదై ఆర్తనాదాలు పెడుతుంది నా హృదయం.

రచన: రంజిత్ కుమార్ బబ్బూరి