పరగడుపున గోరువెచ్చని నీటిని తాగితే…

0
61

పరగడుపున చల్లని నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

* ఉదయం నిద్రలేవగానే పరగడుపున గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కనీసం మెటాబాలిక్ రేటు 24 శాతం పెరుగుతుంది.

* ఆజీర్తి సమస్యకు చెక్ పెట్టొచ్చు. రాత్రి వేళలో పొట్టలో ఎసిడిటి పెరిగిపోతుంది. గుండె మంటకు కూడా యాసిడ్ రిఫ్లక్స్ కారణమవుతుంది. ఈ రెండు సమస్యకు చెక్ పెట్టాలంటే పరగడుపున నీళ్లు తాగితే చాలు. యాసిడ్ డైల్యూట్ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

* పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి.

* రాత్రివేళ శరీరం టాక్సిన్స్ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన్నే నీళ్లు తాగగనే ఆ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి.

* నీళ్లు ఎక్కువగా తాగడం వలన కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది.