‘గ్యాంగ్‌ లీడర్‌’ గా నాని

0
60

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. “జెర్సీ” చిత్రం ఆయన నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా “గ్యాంగ్ లీడర్” నిలిచింది. ఇపుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్‌ను తన కొత్త చిత్రానికి పెట్టాడు. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ లుక్ పోస్టర్ తోపాటు టీజర్‌ను కూడా నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. “ఒక చిన్నపాప సర్.. కూతురు వయస్సుంటుంది. ఎనిమిదేళ్లుంటాయి” అనే డైలాగ్స్‌తో ప్రారంభమయ్యే టీజర్ ఆసక్తికరంగా ఉంది. గ్యాంగ్ లీడర్ లుక్, టీజర్ నాని అభిమానులకు కనువిందు చేస్తోంది. ఈ చిత్రంలో నాని ఐదుగురు మహిళలకు లీడర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.