సాధారణంగా తిమింగలాలు అంటే సముద్రాల్లో కనిపిస్తుంటాయి. కానీ, ది గ్రేట్ అమెజాన్ అడవుల్లో ఓ తిమింగలం కళేభరాన్ని స్థానికులు గుర్తించారు. అదీ కూడా భారీ మృతదేహం. ఇది ఏకంగా 36 అడుగుల పొడవు ఉంది. ఇది హంప్‌బ్యాక్ తిమింగలంగా గుర్తించారు. వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్, బయాలజిస్టులు అక్కడికి చేరుకొని దాన్ని పరీక్షించారు. దాని శాంపిల్స్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అది ఎలా చనిపోయింది. అడవుల్లోకి ఎలా వచ్చింది.. అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బ్రెజిల్‌లో ఉన్న మరాజో ఐలాండ్‌లోనే ఇది కనిపించింది. అమెజాన్ అడవుల్లోనే ఈ ఐలాండ్ ఉంటుంది. అయితే, సముద్రం నుంచి తిమింగలం మృతదేహం ఉన్న ప్రాంతానికి 15 మీటర్ల దూరం ఉంటుందట. సముద్రంలో చనిపోయిన తర్వాత భారీ అలలకు తిమింగలం ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందేమో అన్న కోణంలో బయాలజిస్టులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ జాతికి చెందిన తిమింగలాలు ఈ ఐలాండ్ వైపుకు ఈ సమయంలో రావట. దాని మృతిపై అనేక అనుమానాలున్నాయని.. దానిపై లోతైన విశ్లేషణ చేస్తున్నామని మెరైన్ ఎక్స్‌పర్ట్ రెనాటా ఎమిన్ తెలిపారు. ఇది పెద్ద తిమింగలం కూడా కాదు. ఇది చిన్న పిల్ల. దీని వయసు సంవత్సరం కూడా ఉండదు.. అని దాన్ని మృతిపై దర్యాప్తు చేస్తున్న బిచో డాగువా ఇన్‌స్టిట్యూట్ అనే ఎన్జీవో సభ్యులు చెబుతున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -