అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ 5జీ ఫోన్

0
177

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ సరికొత్త మోడల్‍‌ను ప్రవేశపెట్టింది. ఎంఐ మిక్స్ 3 పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరకించింది. ఈ ఫోన్ షియోమీకి చెందిన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ కావ‌డం విశేషం. దీన్ని మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019 ప్ర‌ద‌ర్శ‌నలో పరిచయం చేసింది. ఈ ఫోనులో అదిరిపోయే ఫీచర్లను అమర్చారు. ముఖ్యంగా, 6.39 అంగుళాళ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, స్నాప్ డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. వెనుకభాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3800 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు. క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్ల‌ు ఉన్నాయి. 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాల‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ఇకపోతే, షియోమీ ఎంఐ మిక్స్-3 5జీ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.48 వేల ధ‌ర‌కు మే నెల నుంచి వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఫీచర్లు… 6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జీ, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0 ప్ల‌స్‌, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్ అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.