సాధారణంగా ఒక మహిళకు ప్రసవం తర్వాత ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రసవానికి ముందులా శరీరం ఉండాలన్నా, జీవక్రియలు సజావుగా సాగాలన్నా.. కొన్ని నెలల సమయం పడుతుంది. అలాగే, ప్రసవం తర్వాత కామ కోర్కెలు కూడా చాల మందిలో గణనీయంగా తగ్గిపోతే, మరికొందరిలో మాత్రం యధావిధిగా ఉంటాయి. దీనికి కారణం వారివారి శరీరం తీరు మీద ఆధారపడి ఉంటాయి. కొందరు మహిళల్లో ప్రసవం అయిన కొద్ది రోజులకే పరిస్థితి మునుపటికి చేరుకోవచ్చు. మరికొందరికి నెలలు గడుస్తున్నా లైంగిక కోరికలనేవి కలగవు. ఇలాంటి మహిళలు ఎలాంటి ఆందోళనా పడనక్కర్లేదు. కొత్తగా తల్లి కావడం, పిల్లల రక్షణ, రాత్రిపూట సరిగా నిద్రలేకపోవడం, వంటి కారణాలు మహిళలను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. ఫలితంగా కామ కోర్కెలు అనేవి పెద్దగా ఉండవు. ఇలాంటి మహిళలు తమ పరిస్థిని భర్తలకు వివరించాలి. పైగా, తన శరీర పరిస్థితిని తెలియజేయాలి. తిరిగి పరిస్థితి అనుకూలించేవరకూ సహకరించాలని నచ్చజెప్పాలి. అదేసమయంలో శరీరం త్వరితగతిన మునుపటి స్థాయికి చేరుకునేందుకు నడక, పరుగు లాంటి వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలి.