ముఖ సౌందర్యానికి చిట్కాలు..

0
68

చాలా మంది ముఖం ఎన్నిసార్లు సబ్బుతో కడిగినా జిడ్డుగానే ఉంటుంది. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఎంతో ఆందంగా ఉంటారు. ముఖ్యంగా, ప్రతి రోజూ రాత్రిళ్లు నిద్రకు ఉపక్రమించేముందు గులాబీ ఆకులను నీళ్లలో వేసి ఉదయం ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే తేటగా ఉంటుంది. వారంలో మూడు రోజులు పాటు మజ్జిగ అన్నం తింటే సన్నగా, నాజూగ్గా ఉంటారు. శరీరంలోని కోలెస్ట్రాల్ కూడా చాలావరకు తగ్గుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోవాలంటే తురిమిన కాకరకాయ గుజ్జును అయా ప్రాంతాల్లో రుద్దితే చాలా వరకు తగ్గుతుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ముఖారవిందం నిత్యం ఆరోగ్యవంతంగా ఉంటుంది.