షేమ్.. షేమ్.. ఇమ్రాన్… డేంజర్‌లో పాకిస్థాన్…

0
56

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాక్ భూభాగంలోకి భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లి ముజఫరాబాద సెక్టార్‌లో ఉన్న జైషే మహమ్మద్ తీవ్రవాద తండాలపై దాడులు చేయడాన్ని పాక్ పౌరులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ దాడిలో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. అలాగే, జైషేకు చెందిన అల్ఫా-3 కంట్రోల్ రూమ్ పూర్తిగా నేలమట్టమైంది. ఈ మేరుపు దాడితో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ‌ మంగళవారం సమావేశమైంది. అపుడు ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బాల్‌కోట్ ప్రాంతంతో ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన దాడుల గురించి మంత్రులు ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష పార్టీల సభ్యులు ఇమ్రాన్ ఖాన్ షేమ్.. షేమ్, పీటీఐ షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదనలు జరిగాయి. ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. ఇమ్రాన్ పని తీరుని విపక్ష సభ్యులు ఎగతాళి చేశారు. భారత్‌కి వ్యతిరేకంగా అందరూ ఒకతాటిపై నిలబడాలని పాక్ మాజీ రక్షణ మంత్రి కవాజా అసిఫ్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు మాత్రం చెవికెక్కించుకోలేదు. పాకిస్థాన్ ఇపుడు చాలా ప్రమాదంలో ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసారు.