భారీ మోసం… అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్‌పై కేసు

0
55

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండో కుమారుడు, సినీ హీరో అల్లు శిరీష్‌పై మోసం కేసు నమోదైంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపారు. అల్లు శిరీష్‌తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో వారందరికీ సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులు జారీచేసిన వారిలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, బొమన్ ఇరానీ, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌, క్రికెటర్ యువరాజ్ సింగ్‌లు ఉన్నారు. వీరంతా వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అసలు వీరంతా ఎలాంటి మోసానికి పాల్పడ్డారో ఓసారి తెలుసుకుందాం. క్యూనెట్ అనేది ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ తరపున సెలెబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. కంపెనీ యాడ్స్‌లో నటించారు. ఆ కంపెనీకి పబ్లిసిటీ చేశారు. ఈ ప్రకటనలు చూసి తాము క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయాని చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులతో పోలీసులు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. ఈ కంపెనీ అనేక మంది అమాయకుల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకున్న క్యూనెట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.