చాలామంది యువకులు చూసేందుకు బాగానే ఉంటారు. కానీ, పడక గదిలో మాత్రం తుస్‌మంటున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. పని ఒత్తిడితో పాటు మానసిక ప్రశాంతత లేకపోవడం, నిద్రలేమి, వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, గంటల తరబడి ఆఫీసుల్లోనే కాలం వెళ్లదీయడం ఇత్యాది కారణాల ఉన్నాయి.
నిజానికి పడక గదిలో ప్రతాపం చూపించలేనివారు… శృంగార సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే సరైన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్నిరకాల కూరగాయాలు, పండ్లు శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. అలాంటివాటిలో ముఖ్యంగా ఐదురకాల పండ్లను మన నిత్యజీవితంలో రోజూ తినడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. మరి ఆ పండ్లేంటో మీరూ తెలుసుకుని, వీలైనన్ని ఎక్కువ పండ్లు తినడానికి ప్రయత్నించండి.
జామపండు: జామకాయను కాకుండా జామ పండును తినడం వల్ల శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. ప్రతి రోజు కనీసం 150 గ్రాములు ఉండే జామకాయను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. జామపండులో ఉండే కొన్ని ప్రోటీన్‌లు పురుషుడి శరీరంలోని శృంగార హార్మోన్‌లను ప్రేరేపితం చేస్తాయి. అందుకే జామపండు శృంగార సామర్థ్యం పెంచడానికి దివ్య ఔషదం అని చెప్పుకోవచ్చు.
నేరేడు పండు: నేరేడు పండ్లలో క్రోమియం, ఫైబర్‌లు ఎక్కువగా ఉంటుంది. ఇవి శృంగార సామర్థ్యంను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండు ప్రతి రోజు సాయంత్రం సమయంలో తినడం వల్ల రాత్రి శృంగారంలో రెచ్చి పోవచ్చు. అలాగే, నేరేడు పండులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
పుచ్చకాయ: వేసవిలో ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపించే పుచ్చకాయలో ఔషధగుణాలు ఉంటాయి. శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కొవ్వు శాతం కూడా తక్కువ. కాబట్టి దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామన్న ఆందోళన కూడా అక్కర్లేదు. ముఖ్యంగా శృంగార సామర్థ్యం పెంచే గుణం ఈ పుచ్చకాయలో ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోధనల ద్వారా వెళ్లడైంది.
ఆపిల్: ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు అయినా ఆపిల్‌ను తినవచ్చు. అనారోగ్య సమస్యలు లేని వారు కూడా ఆపిల్‌ను రోజూ తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అంటారు. అలాగే ఆపిల్ వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.