వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటేశాడు. సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 162 రన్స్ చేశాడు.
గేల్‌కు ఇది 25వ వన్డే సెంచరీ కాగా, 39 ఏళ్ల గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మెట్లలో కలుపుకుని 500 సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అలాగే, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు.
ఈ ఘటన సాధించిన రెండో వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడిగా గేల్ నిలిచాడు. గతంలో వన్డేల్లో పది వేల పరుగుల చేసిన ప్లేయర్లలో బ్రియాన్ లారా ముందు వరుసలో ఉన్నాడు. కాగా, త్వరలో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్ తర్వాత క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన రిటైర్మెంట్‌పై క్రిస్ గేల్ ప్రకటన చేసిన సంగతి విదితమే.