నేను గర్భవతినా.. నాకే తెలియదు.. మీకెలా తెలుసు?

Is Raai Laxmi pregnant? Julie 2 actress reveals the truth

0
45
Laxmi Raai
Raai Laxmi

తెలుగు చిత్రపరిశ్రమలో ఐటమ్ గర్ల్‌గా ముద్రపడిన హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీరాయ్ ఒకరు. ఒక వైపు ప్రధాన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్‌లలో నటిస్తుంది. అయితే, ఈమె గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాగానే సాగుతోంది. తాజాగా రాయ్ ల‌క్ష్మీ గ‌ర్భ‌వ‌తి అంటూ కొంద‌రు త‌ప్పుడు వార్త‌లు పుట్టించారు.

దీనిపై రాయ్ ల‌క్ష్మీ తీవ్రంగా స్పందించింది. కేవ‌లం వ్యూస్ కోస‌మే ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు రాస్తారా? త‌ప్పును ఇంత ధైర్యంగా ఎలా చెబుతారు? కావాలని నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే లీగ‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని ఆమె హెచ్చరించారు. ఒక‌ప్పుడు తనకు లవ్ ఎఫైర్స్ ఉండేవని, కొందరితో బ్రేకప్ కూడా జరిగిందని ఈ సంద‌ర్భంగా ఆమె చెప్ప‌డం విశేషం.

కాగా, ప్ర‌స్తుతం కృష్ణ కిషోర్ దర్శకత్వంలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అనే చిత్రంలో నటిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. మార్చి 15న చిత్రం విడుద‌ల కానుంది.