
భారత రక్షణ స్థావరాలపై బాంబులు వేసేందుకు వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలపై దాడి చేసే క్రమంలో ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశాడు. ఆ తర్వాత అతని నడుపుతున్న యుద్ధ విమానం కూడా కూలిపోయింది. కానీ, అభినందన్ మాత్రం చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకున్నాడు. దురదృష్టవశాత్తు అతను పాకిస్థాన్ భూభాగంలో పడిపోయి ఆ దేశ సైనికులకు చిక్కాడు.

పాకిస్తాన్ చెరలో చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదలపై దేశ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. భారత్ పై ఉన్న పగను పాకిస్తాన్ అభినందన్ పై తీర్చుకుంటుందేమోనని, యావత్ భారత్ భయపడింది. ‘Bring back Abhinandan’ అంటూ దేశ ప్రజలు కోరారు.
పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనౌన్స్ చేశారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యం తోనే పైలట్ అభినందన్ ను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
