పెళ్లికి ముందు అమ్మాయిలు శృంగారంలో పాల్గొంటే లావెక్కుతారా?

0
417
పెళ్లికి ముందు అమ్మాయిలు శృంగారంలో పాల్గొంటే లావెక్కుతారా?

నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందే డేటింగ్‌లు, సహజీవనం పేరుతో శృంగారంలో పాల్గొంటున్నారు. ఇలాంటివారికి పెళ్లికి ముందే దాంపత్య జీవితంపై పూర్తి అవగాహన ఉంటుంది. అదేసమయంలో వీరిని కొన్ని అపోహలు సైతం వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా, పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం వల్ల లావెక్కుతారని, పిరుదులు పెద్దవి అవుతాయని, వక్షోజాలు లూజుగా మారిపోయి, కిందికి జారిపోతాయని, రుతుస్రావం తేదీల్లో మార్పులు సంభవిస్తాయని ఇత్యాది సందేహాలు ఉంటాయి. ఈ సందేహాల నివృత్తి కోసం శృంగార వైద్య నిపుణులను సంప్రదిస్తే…

ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. శృంగారంలో పాల్గొంటే ఒళ్లు చేస్తారనేది కేవలం భ్రమ మాత్రమే. శాస్త్రీయంగా ఇదెక్కడా నిరూపించలేదు. అయితే, శృంగారం చేసే సమయంలో స్త్రీ శరీరం ఆ అనుభవాన్ని ఆస్వాదించడం వల్ల సంతృప్తి చెందుతుంది. అంటే సుఖప్రాప్తి పొందుతుంది. అంతేకాదు ఆ సమయంలో యోనిలో కొన్ని స్రావాలు విడుదల కావడం వల్ల ఫ్రెష్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. అంతేకానీ లావనేది శృంగారం చేయడంపై ఆధారపడి ఉండదు. అలాగే, పిరుదులు కూడా మరింత పెద్దవి అవుతాయన్ని కూడా ఓ అపోహ మాత్రం. కానీ, వక్షోజాలు మాత్రం బిగుతును కోల్పోయే ప్రమాదం ఉంది. శృంగారంలో పాల్గొనే యువతి వక్షోజాలను యువకుడు పదేపదే నొక్కడం వల్ల అవి వాటి బిగుతును కోల్పోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.