రాగి పిండి 1 కప్పు
నీళ్లు 5 కప్పులు
కారం పొడి అరటీస్పూను
ఉప్పు తగినంత
ఇంగువ చిటికెడు
పచ్చిమిర్చి 6
వీటన్నింటిని మీక్సీలో వేసి మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద అరటీస్పూను, కొత్తిమీర 1 కట్ట చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
తయారు చేసే విధానం
ముందుగా ఓక పాత్ర తీసుకుని అందులో రాగిపిండి వేసి అందులో 2 కప్పులు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలిపి కాసేపు పక్కన వుంచాలి. ఇప్పుడు ఓక పాత్ర తీసుకోని అందులో మిగిలిన 3 కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసి కాసేపు బాగా మరిగించాలి. ఇప్పుడు అందులో కారంపొడి, ఇంగువ, పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, వేసి కాసేపు బాగా కలపాలి.
ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన రాగిపిండిని కొంచెం కొంచెంగా జతగా చేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించి పక్కన వుంచాలి. చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కాగితం మీద వడియాలు పట్టుకోవాలి. రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత డబ్బాలో నిల్వ చేసి వుంచుకోవాలి.
ఈ వడియాలు నూనెలో వేయించుకుని అన్నంలోకి స్నాక్‌లాగా తింటే భలే రుచిగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా మీరు ప్రయత్నం చేయండి.