భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముంటున్నాయి. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇప్పటిపకే ఇరుదేశాల గగనతలాలను మూసివేశారు. అనేక ఎయిర్ పోర్టులను మూడు నెలలో పాటు మూసివేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇదేతరహా ఉత్తర్వులను పాకిస్థాన్ సర్కారు కూడా జారీచేసింది. దీంతో భారత్ పాక్‌ల మధ్య యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభంకావొచ్చన్న అంచనాలు జోరందుకున్నాయి. అదేసమయంలో సరిహద్దు గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయిస్తోంది. సరిద్దుకు ఐదు కిలోమీటర్ల మేరకు ఎవరూ ఉండొద్దని, రావొద్దని ఆంక్షలు విధించింది.
మరోవైపు, దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ మరోసారి వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అణు యుద్ధం జరగకుండా నివారించేందుకు అమెరికా, చైనా, ఈయూ, రష్యాలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మరోవైపు విశాఖలో నౌకాదళం యుద్ధ విమానాలతో బుధవారం విన్యాసాలు చేసింది. సరిహద్దుల్లో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను మూసివేశారు. దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పాకిస్థాన్ ఖైదీలకు భద్రతను భారీగా పెంచారు.