ప్రపంచంలో మధుమేహ (చక్కెరవ్యాధి లేదా డయాబెటిక్) వ్యాధి రోగుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే పూర్తి స్థాయి మందులు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆహార నియమాలు (డైటింగ్) ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, తాజాగా పరిశోధకలు జరిపిన పరిశోధనలో ఓ విషయం వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ను తింటే దాంతో వారి చక్కెర ప్రమాణాలు (షుగర్ లెవల్స్) నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది.
దీనికి కారణం బీన్స్‌లో ఎక్కువగా ఫైబర్స్ ఉండటమే. ఇది రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్లే బీన్స్‌ను తినడం వల్ల షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

అంతేకాదు.. బీన్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలతోపాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని వారు అంటున్నారు. అయితే బీన్స్‌ను ఉడకబెట్టుకుని తినడం శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితిలోనూ వీటిని ఫ్రై చేసుకుని తినరాదు. ఉడికించి తింటేనే పైన చెప్పిన లాభాలు కలుగుతాయి..!
నిజానికి బీన్స్‌లో శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్న విషయం తెల్సిందే. ఎన్నో విటమిన్లు, మినరల్స్ వాటిలో ఉంటాయి. ఈ క్రమంలో తరచూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. దైనందిన ఆహారంలో బీన్స్‌ను ఓ ఆహారంగా చేసుకోండి.