వెంట్రుకలు రాలిపోవడానికి చాలా కారణాలు వున్నాయి. ఆవేశం, మానసిక అందోళన, ఆరోగ్య సమస్యలు, మందులు వాడడం వలన రియాక్షన్స్, పిల్లలకు పాలుయిస్తున్నప్పుడు ఇలాంటి చర్యల వల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి.
* వేడి నీటితో తల స్నానం చేయరాదు.
* మంచి నాణ్యత గల షాంపూనే వాడాలి.
* రబ్బర్ బాండ్స్ వాడటం తగ్గించాలి.
* తడి జుట్టు మీద తల దువ్వరాదు.
* వెంట్రుకల చివర్లను 4 నుండి 5 వారాలకొకసారి కట్ చేయించాలి.
* కొబ్బరి నూనె, సిసమ్ అయిల్, కాస్టర్ అయిల్, అన్నీటిని కలిపి జుట్టుకి పట్టంచి గంట తర్వాత తల స్నానం చేయాలి.