అంతరిక్ష పరిశోధనలు, సమాచార సేవలు మాత్రమే కాకుండా రక్షణ రంగానికి సైతం అపారమైన సాయం అందిస్తున్న ఇస్రో ఇటీవలి బాలాకోట్ దాడుల్లోనూ కీలకపాత్ర పోషించింది. భారత సైన్యం నిర్వహించే అనేక ఆపరేషన్లలో ఇస్రోది కీలకపాత్ర. భారత్ ఆర్మీ రూపొందించే ప్రణాళికల్లో ఇస్రో అందించే ఛాయాచిత్రాలే కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా రోదసిలో నిత్యం సంచరించే భారత ఉపగ్రహాలు భూమిపై ప్రతి చిన్న అంశాన్ని కూడా రికార్డు చేయగలిగే సామర్థ్యం వున్నవి కావడంతో ఇస్రో అందించే సమాచారం భారత ఆర్మీకి ఎంతో ఉపయోగపడుతోంది. మొన్నటి పుల్వామా దాడి తర్వాత ఎక్కడెక్కడో ఉన్న ఉగ్రవాదులందరూ స్థావరాలను ఖాళీ చేసి బాలాకోట్ స్థావరంలో తలదాచుకున్న విషయం ఇస్రో ఉపగ్రహాలు వెంటనే పసిగట్టాయి.
ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాలకు మాత్రమే ఈ ప్రత్యేక సామర్థ్యం ఉంది. ఇంకా ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న ఇస్రో ఉపగ్రహాలు దాదాపు పాకిస్థాన్ భూభాగం మొత్తంపైనే ఓ కన్నేసి ఉంచగలవు. దానిలో 87 శాతం పాక్ భూభాగాన్ని అత్యంత స్పష్టంగా చిత్రీకరించగల సత్తా మన శాటిలైట్లకు ఉంది.