* వంట గదిలో పనిచేసే వారి చేతులు చాలా గట్టిగా మారిపోతాయి. బంగాళాదుంపలు వుడకబెట్టిన తర్వాత పేస్ట్‌ని చేతులకి రాసుకుంటే చాలా మృదువుగా తయారవుతాయి.
* వంట గదిలో బొద్దింకలు రాకుండా వుండాలంటే.. తలుపుల గొళ్లాల మీద, కిటికీల దగ్గర సాధారణ ఉప్పు లేదా టర్పెంట్ ఆయిల్ చల్లితే చాలు.
* మజ్జిగలో అరగంట పాటు నాననిచ్చిన పచ్చి అరటికాయ ముక్కలను వేయించి చిప్స్ తయారు చేస్తే చాలా రుచిగా వుంటాయి.
* ఓ గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి, కూరగాయలు మీద చల్లితే చాలా తాజాగా వుంటాయి.
* తెల్లని బట్టలు మీద మరకలు పోవాలంటే నిమ్మరసం వేసి నిమ్మతొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు పోతాయి.