స్టూడెంట్స్ కి వెంకయ్య నాయుడి మెసేజ్

0
43

హైదరాబాద్ కవాడిగూడ లోని ఏపీ ఎడ్యుకేషన్ సొసైటీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు పాల్గున్నారు. ఈ సందర్భం గా ఆయన ప్రసంగం లోని కొన్ని హై లైట్స్.

* ఉత్తమమైన విద్యా సంస్థ ఏర్పాటు చేయడం, నగరంలో ప్రఖ్యాతి గాంచడం అభినందనీయం.
* 1944 ప్రారంభమైన ఏవీ విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది.
* మిగితా దేశాల కంటే మన దేశంలోనే యువత ఎక్కువగా ఉంది.
* విద్య అనేది ఉపాధి కోసం కాదు, గౌరవం, సమాజ అభివృద్ధి కోసం.
* ప్రపంచ దేశాలతో పోలుస్తే భారత దేశం వ్రుద్ది రేటు 7 శాతం ముందుంది.
* ప్రకృతి, సంస్కృతిని కాపాడుకుంటే భవిష్యత్ బాగుంటుంది.
* యోగ అనేది ఎలాంటి మతానికి, వ్యక్తులకు సంబందించింది కాదు శరీరానికి సంబందించింది.
* యోగా అనేది జీవితంలో ఒక భాగం ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి.
* ప్రాధమిక విద్య మాతృ భాషలోనే ఉండాలి.
* ఏపీ, తెలంగాణల్లో పరిపాలన తెలుగులో జరగాలి.
* మాతృ భాషను గౌరవించాలి.
* మన విద్యా విధానం పరాయి వారి మోజు నుంచి బయట పడాలి.
* మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించాలి.
* పూర్వం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటించాలి.
* తల్లిదండ్రులను,పెద్దలను,మాతృభాషను గౌరవించాలి.
* మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలి.
* తెలుగు రాష్ట్రాల లో తెలుగు లో పాలన ఉండాలి.
* మాతృ భాషను మర్చిపోతే మూలలను మర్చిపోతాం.
* వేషం, భాష ఏదయినా మనము అందరూ భారతీయులం.
* పరాయి భాష వ్యామోహం పోవాలి.
* మాతృ భాష పరిరక్షణ కు అందరూ తోడ్పడాలి.
* మన విద్యా విధానం పరాయిమోజు నుండి బయటకి రాలేదు..
* విద్య విధానం లో చాలా మార్పులు రావాలి.
* మహిళలకు అవకాశం ఇస్తే…ఏదైనా సాధించగలరు.
* విద్య లో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించాలి.