భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు పూర్తయిందనీ, అసలైంది జరగాల్సి వుందంటూ మోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి.
ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపాయి. ఈ దాడుల్లే జైషే స్థావరాలను నేలమట్టం చేశాయి. వీటికి ప్రతీకారంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలతో దాడికి వచ్చింది. ఈ దాడిని భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరు దేశాల మధ్య హైటెన్షన్ నెలకొనివుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘ప్రయోగాల కోసం మీరు ప్రయోగశాలల్లో మీ జీవితాల్ని ధారపోస్తారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్ చేయడం మీ సంప్రదాయంగా వస్తోంది. ఆ తర్వాత అది విరాట్ స్వరూపానికి వస్తుంది. అదే తరహాలో ఇటీవలే పైలట్ ప్రాజెక్ట్ పూర్తయింది’ అని వ్యాఖ్యానించారు.
‘ఇప్పుడు అసలైంది జరగాల్సి ఉంది. ఇటీవల జరిపింది ప్రాక్టీస్ కోసం మాత్రమే. అసలైంది జరిగితే ఇవాళ్టి విజేతలకు నిజంగా స్టాండింగ్ ఒవేషన్ (గౌరవ సూచకంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టడం) ఇచ్చినట్లౌతుంది’ అని మోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా యుద్ధానికి సంబంధించిన హెచ్చరిక పాకిస్థాన్ కోసం చేసినట్టుగా తెలుస్తోందని, సర్జికల్ స్ట్రైక్స్ కేవలం పైలట్ ప్రాజెక్టు ప్రాక్టీస్‌గా ఆయన పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది.