అబ్బ… వల్లకాదంటూ నిరాకరిస్తుంది.. నాకేమో కోర్కెలెక్కువ… ఏంచేయాలి?

0
57
Reasons for Low sexual desires.

చాలా మంది భర్తలు కామ కోర్కెలతో రగిలిపోతుంటారు. కానీ, పడక గదిలో మాత్రం భార్య ఏమాత్రం సహకరించదు. పైగా, మొగ్గుబడిగా అయినా శృంగారంలో పాల్గొనేందుకు ససేమిరా అంటుంది. అబ్బ.. నీరసంగా ఉందండీ.. నావల్ల కాదంటూ నిద్రకు ఉపక్రమిస్తుంది. ప్రతి రోజూ ఈ విధంగా ప్రవర్తించే భార్యలు లేకపోలేదు. దీంతో భర్తలకు వయస్సు మీదపడటంతో పాటు.. కోర్కెలు కూడా తగ్గిపోతుంటాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. కొందరైతే పక్క చూపులు చూస్తే.. మరికొందరు మానసిక ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడుతారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య పడగ గదిలో మాత్రం ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తుందో మానసిక నిపుణులను సంప్రదిస్తే…

భార్యాభర్తల మధ్య శృంగార సమస్యలు ఉత్పన్నంకావడానికి శారీరక, మానసిక కారణాలు ఉన్నాయి. వ్యాధులు లేనప్పుడు భాగస్వామి ప్రవర్తనే ప్రధాన కారణంగా నిలుస్తుందని, ఒకవేళ శృంగార సమస్యలు ఉన్నా వాటి పరిష్కారంలో భాగస్వామి సహకారం లేకున్నా అవి ఎక్కువవుతాయి.

నిరంతరం ఘర్షణ పడే దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి, అశాంతికి లోనైనపుడు మనసే కేంద్రంగా పనిచేసే సాధారణ శృంగార చక్రం కలిగించే రసాయన, నాడీ, హార్మోన్ స్పందనలు కుంటుపడతాయని చెపుతున్నారు. దీనివల్ల మగవారికి స్తంభన లోపం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Sexual Desire Differences.

అలాగే, స్త్రీలలో ఫ్రిజిడిటీ వంటి సమస్యలు కలుగుతాయని, పురుషులలో ఆధిపత్య ధోరణులు స్త్రీలలో ఆత్మనూన్యత, డిప్రెషన్‌కు దారితీసి వారిలో శృంగారంపై ఆసక్తిని తగ్గించి వేస్తాయిని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

వరకట్న వేధింపులు, ఇంట్లో అత్త, ఆడబిడ్డల ఆరళ్లు, చదువు – ఉద్యోగాలు కొనసాగించ లేకపోవడం, పిల్లల పెంపకం వంటివి స్త్రీలలో డిప్రెషన్‌ను కలిగిస్తాయంటున్నారు. భార్యాభర్తలు పరస్పరం అనుమానించుకోవడం కూడా ఈ పరిస్థితిని ఎక్కువ చేస్తుందంటున్నారు.

Resolve Sexual Desire Differences.

పురుషులలో భార్య సహకరించకపోవడం, తిరస్కారం వల్ల ఆత్మనూన్యతకు దారితీసి పర్‌ఫ్మాన్స్ ఆంగ్జైటీతో శృంగార సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు.