మేము సికింద్రాబాద్‌లో ఉంటున్నాం. ఇటీవలే వివాహమైంది. అదే రోజు రాత్రి శోభనం జరిగింది. తొలి రోజు రాత్రే.. మేమిద్దరం శారీరకంగా కలుసుకున్నాం. అనేక సార్లు శృంగారంలో పాల్గొన్నాం. కానీ ఒక్కసారి కూడా నా భార్యకు రక్తస్రావం కాలేదు. దాంతో ఆమెకు పూర్వానుభవం ఉందనే అనుమానం ఎక్కువైంది. సాధారణంగా, ప్రతి అమ్మాయికీ తొలి కలయికలో రక్తస్రావం కనిపించాలనీ లేదంటే ఆమెకు అంతకుముందు అనుభవం ఉందని భావించాలనీ స్నేహితులు అంటున్నారు. ఇది నిజమేనా? నా సందేహాన్ని నివృత్తి చేయండి ప్లీజ్…
ఇదే అంశంపై శృంగార వైద్య నిపుణులు స్పందిస్తూ, తొలిసారి శారీరకంగా కలిసిన అమ్మాయికి రక్తం రావాలన్న నిబంధనేమీ లేదు. కొందరికి రక్తస్రావం కావొచ్చు.. మరికొందరికి కాకపోవచ్చు. అంతమాత్రాన ఆమెను కన్య అనుకోకుండా ఉండనవసరం లేదు. తొలి కలయికలో రక్తం కనిపించడానికి కారణం, ఆమె కన్నెపొర చిరగడమే.
ఈ పొర కొందరిలో మందంగా ఉండి తొలి కలయికతోనే చిరుగుతుంది. ఎక్కువశాతం మందిలో ఈ పొర పలుచగా ఉండి బాల్యంలో ఆటలాడే సమయంలో, సైకిల్ తొక్కేసమయంలో చిరిగిపోతుంది. ఎత్తు నుంచి దూకినా, గుర్రపు స్వారీ చేసినా…. ఇలా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఎలాంటి ఆటలాడే సమయంలోనైనా కన్నెపొర చిరిగిపోవచ్చు.
ఇలాంటి అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో రక్తం కనిపించదు. కాబట్టి మీ భార్యకి కూడా ఇలాగే జరిగి ఉండవచ్చు. రక్తస్రావం గురించి మీ స్నేహితులు చెప్పిన మాటలు విని మీ భార్యను అనుమానించి బాధ పెట్టకండి. మనసు నుంచి అనుమానాలను వెళ్లగొట్టి, దాంపత్య జీవితాన్ని సుఖంగా ఆస్వాదించండి.