పోషకాల గని తేగలు…

0
123

వేసవి కాలంలో లభించేవి తేగలు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్ధాల వల్ల జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే పీచుపదార్దాలు పెద్దపెగుల్లో వుండే మలినాలు చేరకుండా కాపాడుతాయి. వీటిలోని కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

తేగల్లో పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. పోటాషియం, బి, బి1, బి3, సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలోని తెల్లకణాలను పెంచుతాయి. మెదడు చురుకుగా పని చేస్తుంది.

తేగలు తినటం వలన బరువు తగ్గుతారు. కేన్సర్ బారిన పడరు. బడ్ల్ క్యాన్సర్‌కు తేగలు చెక్ పెడతాయి. ప్రారంభదశలో ఉన్న కేన్సర్‌ను తగ్గిస్తుంది. ఇవి శరీరానికి చలవనిస్తాయి.

ఆకలిని నియంత్రించే శక్తి వీటిలో ఉండడం వల్ల ఎక్కువ ఆహరం తీసుకోలేరు. అందువల్ల బరువు తగ్గుతారు. వీటిలో క్యాలరీలు, సోడియం, ప్యాట్ తక్కువుగా ఉంటాయి.