వేసవి చిట్కాలు.. చర్మం తేమగా ఉండాలంటే..

0
65
Useful Summer Care Tips

వేసవిలో ఎండవేడిమికి చర్మం కమిలి పోకుండా మృదువుగా వుండాలంటే మాయిశ్చరైజర్ క్రీములు వాడాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 8 నుండి 10 గ్లాసులు నీటిని తాగాలి.

వేసవిలో పెరుగును క్రమం తప్పకుండా వాడుకోవాలి. పెరుగు వాడటం వల్ల చల్లదనం కలిగించడమేకాకుండా మంచి పౌష్టికాహరం కూడా లభిస్తుంది. వేసవిలో పుచ్చకాయలు, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు మెుదలైనవి తాగటం వలన మన శరీరానికి చల్లదనం చేకురుతాయి.

సబ్బుకు బదులు సున్నిపిండిని వాడటం వలన చర్మానికి శేయష్కరం. ఎండవేడిమికి వెంట్రుకలు చిట్లిపోవడం, రంగు మారిపోవడం జరుగుతుంటాయి. అందువల్ల ఎండలో తిరుగుతున్నప్పుడు జుట్టును గుడ్డతో కప్పుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల అటు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూనే.. వడదెబ్బబారిన పడకుండా ఉండొచ్చు.