కొంత మందికి అదేపనిగా గొళ్లు కొరకడం అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటుతో పాటు దంతాలు కూడా పాడవుతాయి. అందుకని ఈ అలవాటును మానుకునే మార్గాలు మనమే వెత్కుకోవాలి. అన్నింటికన్నా ముందు గోళ్లు కొరకడం మానుకోవాలని ధృఢనిశ్చయంగా మనమే ఓ నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయాన్ని పదే పదే గుర్తు చేసే విధాంగా రిమైండర్‌ను ఏర్పాటు చేసుకుంటే మరి మంచిది.
* అంటే ఇంట్లోనూ, ఆఫీసులోనూ, ఎక్కువగా మీరు పనిచేసే చోట ఆ మాట రాసిన లేబుల్ అతికించి పెట్టుకోవాలి. కాల్షియం లోపాల వల్ల కూడా కొందరికి ఈ గోళ్లు కొరికే అలవాటు వస్తుంది. అందువల్ల మన శరీరంలో కాల్షియం తగ్గకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇతర విధానాల్లో గోళ్లు కొరకడం మానుకోవడం సాధ్యం కాదనిపిస్తే గోళ్లకు చేదుగా వుండే వేప లేదా కలబంద గుజ్జును రాసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే గోళ్లు కొరకడం సులభంగా మానేస్తారు.