సాహసవీరుడికి మహావీర్ అహింసా పురస్కారం

No bugs found in wing commander Abhinandan body

0
45
Abhinandan
Abhinandan

పాకిస్థాన్ చెర నుంచి క్షేమంగా బయటపటపడిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు మహావీర్ అహింసా పురస్కారం వరించనుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

అయితే, ఆయనకు జరిపిన వివిధ రకాల స్కాన్‌లలో మిగ్-21 యుద్ధ విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో దూకిన క్రమంలో అభినందన్ వెన్నెముక కింది భాగంలో గాయాలయ్యాయని వైద్య నిపుణులు తేల్చారు. అలాగే పక్కటెముకలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయని గుర్తించారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో దిగిన వెంటనే పాకిస్థాన్ మూకలు అభినందన్‌పై దాడి చేశాయి. ఈ క్రమంలో పైలట్ పక్కటెముకలకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అభి శరీరంపై ఉన్న గాయాలు, ఆయన శరీర సామర్థ్యం, మానసిక స్థితి తదితరాలపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.

అభినందన్ శరీరంలో పాక్ సైన్యం ఏమైనా బగ్స్‌ను అమర్చిందా? అనే కోణంలో పరీక్షలు జరుపగా, అలాంటిదేమీ లేదని ఎంఆర్‌ఐ నివేదికలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.