చదవగలిగితే అష్టోత్తరాలు లేకుంటే ఓం నమశ్శివాయ…

0
71

సోమవారం, మాఘ బహుళ చతుర్దశి, 4 మార్చి 2019 రోజున మహాశివరాత్రి వస్తోంది. మాఘ బహుళ చతుర్దశినాడు ఆ పరమేశ్వరుడి జన్మదినముగా జరుపుతారు. ఆ రోజున శివుడు లింగరూపములో బ్రహ్మ, విష్ణువుకు దర్శనమిచ్చాడని ప్రతీతి.

మాఘమాసములో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తారు. ప్రతినెలలో ఆరోజు పగటిపూట ఉపవాసము వుండి సాయంత్రము మట్టితో శివలింగాన్ని చేసుకుని గాని, లేక మీకు అందుబాటులో వున్న శివ లింగమునుగాని పూజగదిలో ఒక పల్లెములో వుంచి.. స్వామికి ఆవాహన పలికి అభిషేకము చేయాలి.

ఈ అభిషేకము శక్తి వున్నవాళ్ళు ఋత్విక్కులను నియమించుకుని ఆశక్తిలేనివాళ్ళు తామే నమశ్శివాయ అనుకుంటూ స్వామిని మన తృప్తితీరా నీళ్ళతో పాలతోనూ అభిషేకించుకోవాలి. తరువాత వస్త్రము సమర్పించి, గంధము, కుంకుమలతో అలంకరించి పూలతో మారేడు దళములతో పూజించాలి.

చదవగలిగితే అష్టోత్తరాలు లేకుంటే ఓం నమశ్శివాయ అనే పంచాక్షరిని జపిస్తూ పూజ చేయవచ్చు. తరువాత ధూపము దీపము చూపి మనశక్తికొలది నైవేద్యము సమర్పించి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.